ఏపీ నుంచి ఎన్నికైన ముగ్గురు నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వారి చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.