ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) ఆదివారం అమెరికాలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన ఇంటి వరండాలో నిల్చోని చుట్టు పక్కల ప్రకృతిని వీడియో తీసి ‘అద్భుతమైన క్షణం’ అంటూ కామెంట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.