అర్తాంలో ఫ్రైడే - డ్రైడే
కొమరాడ మండలం అర్తాం గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే - డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం డా. టి. జగన్మోహన రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు పరిశీలించి వాటిని పారబోయించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. జ్వర లక్షణాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు.