గోతులమయంగా మారిన అంతరాష్ట్ర రహదారి

56చూసినవారు
పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్ రాష్ట్ర రహదారి గోతుల మయంగా తయారైంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రహదారిపై ఏర్పడిన గోతులలో నీరు నిల్వ ఉండడంతో సోమవారం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రహదారిపై ఏర్పడిన గోతులలో పడిపోయిన సంఘటన కూడా ఉన్నాయి. తక్షణమే రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి గోతులను పూడ్చి పెట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్