అంతరాష్ట్ర రహదారిపై సిపిఎం వినూత్న నిరసన

62చూసినవారు
కొమరాడ అంతరాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులను కప్పాలని కోరుతూ వినూత్న రీతిలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కొల్లి సాంబమూర్తి నిరసన తెలిపారు. మంగళవారం రోడ్డుపై ఏర్పడిన గోతులలో ఈత కొడుతూ ఆకులను ఒళ్లంతా కట్టుకొని చేపలు పడుతూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డుపై గోతులు పూడ్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్