గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో మంగళవారం పీసా చట్టాలపై గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ వర్గాలను దోపిడీదారుల నుంచి రక్షించడంలో ఈచట్టం కీలక పాత్ర పోషిస్తుందని అలాగే షెడ్యూల్డ్ తెగల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ జీవన విధానాలపై ఈ చట్టం ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించారు. సచివాలయ సిబ్బంది, గిరిజన పెద్దలు, యువత ఉన్నారు.