మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన కందికొత్తల ఉత్సవాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే జగదీశ్వరి గిరిజనులతో ప్రజలతో కలిసి దింసా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ఆచార సాంప్రదాయాల్లో భాగంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.