పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఆదివారం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొంగొత్త ఆశలు, ఆశయాలు నెరవేరి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రైతుల ఇంట ధన, ధాన్యాభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని కోరారు. దేవుడి ఆశీస్సులతో జిల్లా సమగ్ర అభివృద్ధికి సమష్టి కృషి సాగిద్దామన్నారు.