నర్సీపట్నం ప్రభుత్వం మద్యం దుకాణాలలో మిగిలిపోయిన మద్యం నిల్వలను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో మద్యంతో పాటు ఫర్నిచర్ సైతం అనకాపల్లి డిపోకు బుధవారం రాత్రి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో మిగిలిన మద్యం నిల్వలను నమోదు చేసుకున్నామని ఎస్సై కిరణ్ తెలిపారు. కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లు సైతం తరలిస్తున్నమన్నారు.