గొలుగొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సీఐగా మధుకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మద్యం విధానంలో భాగంగా షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగిసిందని, అయితే ప్రభుత్వం మళ్లీ ఈనెల 11 సాయంత్రం 7గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.