నెల్లిమర్ల, తంగుడిబిల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం 8వ తరగతి విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులు శివుకు బంగారయ్య తన సొంత ఖర్చులతో ఎన్. ఎం. ఎం. ఎస్ మెటీరియల్ ను ప్రధానోపాధ్యాయులు వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. ఎన్. ఎం. ఎం. ఎస్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం,సెలవు దినాల్లో ప్రైవేట్ క్లాసులు చెప్పడంతో పాటు, పేద విద్యార్థులకు తన సొంతఖర్చుతో స్టడీ మెటీరియల్ అందిస్తున్నారన్నారు.