నెల్లిమర్ల: తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

62చూసినవారు
నెల్లిమర్ల: తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి
గత 2 రోజుల నుండి అల్పపీడనం కారణంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెరైన్ పోలీసులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. నెల్లిమర్ల మండలం ముక్కాం సమీపంలో సముద్రపు అలలు ఎగిసిపడటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు చెబుతున్నారు. రానున్న 3 రోజులు వర్షాలు కురవనున్న క్రమంలో మెరైన్ పోలీసులు పహారా కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్