పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ రామస్వామి దేవస్థానంకు సంబంధించి హుండీ ఆదాయాన్ని గురువారం ఈవో వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లెక్కించారు. హుండి ఆదాయం రూ. 28. 8 లక్షలు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయం గడచిన ఐదు నెలలకు సంబంధించి వచ్చినట్లు తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఏపీజీబీ బ్యాంకు సిబ్బంది తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.