పూసపాటిరేగ మండలం గుంపాం కు చెందిన లెంక శ్రీనివాసరావు (23) కు ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కే నాగమణి 7 సంవత్సరాల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. 9 ఏళ్ల మైనర్ బాలికపై నిందితుడు శ్రీనివాసరావు అత్యాచార యత్నం చేసిన నేపథ్యంలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో 2022లో కేసు నమోదైనట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలుగురించినట్లు తెలిపారు.