భామిని మండలంలోని గురండి జంక్షనులో బత్తిలి ఎస్సై డి. అనిల్ కుమార్ శుక్రవారం వాహన తనిఖీలు చేశారు. వాహనచోదకులు ప్రతీ ఒక్కరూ హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. వాహనాల్లో మత్తు పదార్ధాలు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.