వీరఘట్టంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు

78చూసినవారు
వీరఘట్టంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
వీరఘట్టం మేజర్ పంచాయతీలో శుక్రవారం వైసీపీకి చెందిన సుమారు 100 మంది టీడీపీలో చేరారు. మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఖండాపు వెంకటరమణ ఆధ్వర్యంలో టీడీపీ పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల భూదేవి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. మాజీ ఎంపీటీసీ యాళ్ల అప్పల నరసమ్మ, మేజర్ పంచాయతీ సభ్యులు యాళ్ల ప్రసాద్, రజక వీధి, బీసీ వీధి, దుర్గ పేట, దొరల వీధి, మందిరం వీధికి చెందిన కార్యకర్తలు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్