పాలకొండ ఇంజనీరింగ్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి పనిలో ఒత్తిడిని జయించే అంశంపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మానసిక ఆరోగ్య ప్రోగ్రాం జిల్లా టీం సభ్యులు కే కృష్ణారావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. మానసిక ఆరోగ్యమే మానవ శరీర ధర్మ చర్యలకు మూలమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెఈ కీర్తన, డిఏఓ మోహనరావు, ఏవి రమణ, జెఈ కాంతారావు పాల్గొన్నారు.