పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిని పి. ఆర్ రాజుపేట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖరీఫ్ పంటకు సాగునీరు సమస్య రైతులను వేధిస్తోందని వివరించారు. వర్షం నీరు సరిపోక పంట భూములు బీటలు పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.