కొత్తూరు మండలం కారిగూడ ఆంధ్రప్రదేశ్ మినీ గురుకులంలో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించడం లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గురుకులానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఇళ్లకు తీసుకుపోతామని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కనీసం భోజన సదుపాయంతో పాటు మరుగుదొడ్లు ఇతర వసతులు ఏమి లేవని వారు తెలియజేశారు. పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు.