విశాఖపట్నంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలకు వెళితే ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీనితో బైక్ నడుపుతున్న పవన్ కుమార్, వెనుక కూర్చున్న రూపేష్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. పవన్ సొంతూరు పాలకొండ కాగా. 15 రోజులే క్రితం వివాహం జరిగింది. రూపేష్ కుమార్ హైదరాబాద్లో చార్టెడ్ అకౌంట్ గా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.