మన్యం జిల్లాలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. పాచిపెంటలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని, తద్వారా ఆర్ధిక పురోగతి లభించగలదని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.