రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాచిపెంట మండలం కర్రివలస గ్రామ సర్పంచ్ పెద్దింటి గంగమ్మకి 104 సిబ్బంది శుక్రవారం వినతిపత్రం అందించారు. మా సమస్యలు పరిష్కరించాలంటూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వెహికల్స్ కి ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ చేయించాలని, 2020లో జాయిన్ అయిన డీఈవో అండ్ డ్రైవర్ కు జీవో నెంబర్ 7 ప్రకారం వేతనం ఇవ్వాలని, పిఎఫ్ & ఈఎస్ఐ యాజమాన్యం వాటా యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు.