డయల్ యువర్ డిఎహెచ్ఒకు 23 వినతులు అందాయని జిల్లా పశు సంవర్థక అధికారి శివ్వాల మన్మథరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి డయల్ యువర్ డిఎహెచ్ఒ ( పశు సంవర్థక అధికారి) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది రైతులు వారి సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం అందజేసిన టిఎంఆర్తో పాల దిగుబడి గణనీయంగా పెరిగిందని, సబ్సిడీతో కూడిన టిఎంఆర్, మిశ్రమ దాణాను సరఫరా చేయాలని కోరారు.