ప్రతిఒక్కరికీ బాలల హక్కులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని లోక్ అదాలత్ సభ్యులు, సీనియర్ న్యాయవాది టి. జోగా రావు అన్నారు. బుధవారం అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బెలగాంలోని ఎమ్. జే. పి. స్కూల్లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్యర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలలు ఆర్థిక, సామాజికపరంగా న్యాయం పొందేందుకు చట్టాలపై అవగాహన అవసరం అన్నారు.