గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజున పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ జెంజేటి రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు మాత్రమే కాక, సూచీ గ్రంథాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. చదవడానికి శ్రధ్ధ ఉండాలని, కృషిఉంటే మనుషులు ఋషులౌతారు అని ఆయన చెప్పారు.