ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. సీతంపేట ఐటిడిఏ ఎస్. ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ఆర్జీలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించవచ్చని, జిల్లా అధికారులు, పిజిఆర్ఎస్ కు సీతంపేటలో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.