విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం పార్వతీపురంలోని జీజే కళాశాల మైదానంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాన్ని నిర్వహించారు. యూటీఎఫ్ 50 ఏళ్లుగా ఎన్నో సమస్యలపై పోరాడి పరిష్కరించిందన్నారు. నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తే యూటీఎఫ్ నేడు 10 వేల మందికిపైగా సభ్యులతో అతిపెద్ద సంఘంగా అవతరించందని వెల్లడించారు.