ప్రజారోగ్య సమస్యలను సత్వరమే గుర్తించడం పై దృష్టి సారించాలని వైద్యారోగ్యశాఖ మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఆయన మక్కువ పిహెచ్సి, కాశీపట్నం కెజిబివి ని గురువారం సందర్శించారు. పీహెచ్సిలో ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్స్ ఇచ్చిన అనంతరం తల్లీ-బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనంలో ఇంటికి బయల్దేరుతున్న గర్భిణీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు.