పార్వతీపురం: రోడ్డపై గుంతను పూడ్పించిన టౌన్ సిఐ
పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక బైపాస్ రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో అటు వైపు వెళుతున్న వాహనాలు అందులో ఇరుక్కుపోయి వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులను చూసి స్థానిక పట్టణ సిఐ వి. నారాయణరావు బుధవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతలు పూడ్చి వేయించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కానిస్టేబుల్, హోంగార్డులు ఉన్నారు.