మెంటాడ: ఉద్దంగిలో పల్లె పండగ కార్యక్రమం

71చూసినవారు
మెంటాడ: ఉద్దంగిలో పల్లె పండగ కార్యక్రమం
మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో శనివారం ఎంపీడీఓ భానుమూర్తి ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకుల ప్రతిపాదన మేరకు గ్రామ అవసరార్థం ముందుగా చేయవలసిన పనులు గుర్తించి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెంటెండి త్రినాధ, తాడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్