సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ పండగకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 18, 19, 20 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించాలని నిశ్చయించారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత పండగ జరపాలని నిర్ణయించడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పట్టణంలో శ్యామలాంబ ఆలయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సాలూరు యువరాజు, అనువంశిక ధర్మకర్త సన్యాసిరాజు, హాజరైన నాయకులు పండగపై చర్చించారు.