సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సాలూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి బి. కనకలక్మి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో గల వసతి సౌకర్యాలను, భోజనశాలను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. హాస్టల్‌లో ప్రతి విద్యార్థినితో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకొని, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సాధించాలని, వసతి గృహంలో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.