మొక్కజొన్న సాగు చేసే రైతులందరూ కత్తెర పురుగు పట్ల తగు జాగ్రత్తలు వహించాలని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. బుధవారం మండలం మిర్తి వలస గ్రామంలో రైతులు మొక్కజొన్న పంటపై ఆశించే కత్తెర పురుగు గుడ్డు దశ నుండి నివారించడానికి పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ పురుగు విత్తనం నాటిన వారం రోజుల నుండి (గుడ్డుదశ)ఈ(గుడ్డుదశ) ఈ పురుగును నివారించుకోవలసిన అవసరం ఉందని అన్నారు.