తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకి మద్దతు తెలుపుతూ శృంగవరపుకోట నియోజకవర్గంలో
టీడీపీ నేతలు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఐదు మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్వారా వచ్చిన సుమారు 700 ఉత్తరాలు వచ్చాయని నియోజకవర్గ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిజిస్టర్ పోస్టు ద్వారా శుక్రవారం పంపించమని ఆమె తెలిపారు.