ఎల్ కోట మండలం కొట్యాడ తలారి గ్రామంలో గల హైస్కూల్ విద్యార్థులు తమ సేవా గుణం చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు విరాళాల రూపంలో సేకరించిన రూ 5 వేల చెక్కును సీఎం సహాయ నిధికి ఆదివారం ఎల్ కోట లోని ఎమ్మెల్యే లలిత కుమారికి ఆమె స్వగృహంలో అందజేశారు. చిన్నతనం నుండి విద్యార్థులకు అలవడిన సేవా గుణం పై ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో హై స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.