మెట్ట ప్రాంతాల్లో భూములు కలిగిన రైతులకు బిందు సేద్యం ఎంతగానో దోహదపడుతుందని వెలుగు ఏపిఎం మధు మహేష్ అన్నారు. బుధవారం జామిలో ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో బిందు సేద్యం చేస్తున్న రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని అన్నారు. ఐదు ఎకరాల పైబడి బిందు సేద్యం చేస్తున్న రైతులకు వ్యవసాయ సాగుకు 50 శాతం పైబడి రాయితీ కల్పిస్తోందన్నారు. మెట్ట ప్రాంత రైతులు బిందు సేద్యంపై ఆసక్తి చూపాలన్నారు.