విజయనగం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వ్యాప్తంగా 5 మండలాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం తెలిపారు. ఎస్‌కోటలో అత్యధికంగా 31.8 మిల్లీమీటర్లు, వేపాడలో 17.8 మిల్లీ మీటర్లు, కొత్తవలసలో 27.0 మిల్లీ మీటర్లు, జామిలో 30.4 మిల్లీ మీటర్లు, ఎల్ కోటలో 27.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.