క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తూ అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ సూర్యనారాయణమూర్తి ఆదివారం తెలిపారు. ఎస్. కోట మండలం బొడ్డపాడు కు చెందిన జన్ని సన్యాసి (50) తన జీడి, మామిడి తోటలకు క్రిమి సంహారక మందులు పిచికారి చేస్తూ ఈనెల 12 న అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.