వేపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం స్థానిక పిహెచ్సి వైద్యులు చిరంజీవులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కళాశాలలో 80 మంది విద్యార్థులకు కంటి వైద్యులు ఈశ్వరరావు పర్యవేక్షణలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. హెల్త్ అసిస్టెంట్ వెంకటరమణ తదితర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.