వేపాడ: మండలంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

81చూసినవారు
వేపాడ: మండలంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
వేపాడ మండలం బొద్దాంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 60 మంది రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాలమిక్ అధికారి సత్యవతి తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం 25 మంది రోగులను కంటి శస్త్ర చికిత్స నిమిత్తం విశాఖ శంకర్ ఫౌండేషన్ కు పంపినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు ఎర్ర సన్యాసిరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్