టీ షర్టు కోసం ఘర్షణ.. తమ్ముడు చేతిలో అన్న హతం

8768చూసినవారు
టీ షర్టు కోసం ఘర్షణ.. తమ్ముడు చేతిలో అన్న హతం
సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో టీ షర్ట్ కోసం జరిగిన ఘర్షణలో తమ్ముడు చేతిలో అన్న హతం అయ్యాడు. ఈ ఘర్షణలో అన్న రమేశ్ (31) ను తమ్ముడు సురేశ్ (25) నెట్టివేయడంతో తలకు రాయి తగిలింది. తీవ్ర గాయం కావడంతో స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రమేశ్ మృతిచెందినట్లు సంతబొమ్మాలి ఎస్సై సిద్ధార్థ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై  చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్