వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. 12వ తేదీన విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఏ కేసుకు సంబంధించి విచారించనున్నారో నోటీసుల్లో పేర్కొనలేదు. దీంతో విజయసాయిరెడ్డి విచారణను ఎలా ఎదుర్కుంటారో అని వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.