తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 1 నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 30న సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని తెలిపారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేడుకల దృష్ట్యా అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశామన్నారు.