తమ చిన్న వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్న మహిళలకు వడ్డీ రహిత రుణాలను అందించేదే ఉద్యోగిని పథకం. అవసరమైన అర్హతా ప్రమాణాలున్న దరఖాస్తుదారులు ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10 శాతం నుంచి 12 శాతం వడ్డీ మీద రుణం ఇస్తారు.