తిరుమల లడ్డూ వివాదం.. రజినీకాంత్ స్పందనిదే

67చూసినవారు
తిరుమల లడ్డూ వివాదం.. రజినీకాంత్ స్పందనిదే
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రజినీకాంత్‌కు ఏపీలో వివాదాస్పదంగా మారిన తిరుమల లడ్డూ కల్తీపై ప్రశ్న ఎదురైంది. దీనిపై రజినీకాంత్ స్పందిస్తూ.. ‘సారీ.. నో కామెంట్స్’ అంటూ జవాబిచ్చారు. మరో వైపు ఏపీలో లడ్డూ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. జగన్ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్