టాటా ఐఫోన్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం (Video)

74చూసినవారు
తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలోని టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెబైల్‌ ఫోన్‌ యాక్సెసరీస్‌ పెయింటింగ్‌ యూనిట్‌లోని రసాయన గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక అధికారులు ఏడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్