AP: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయలు వెలుగు చూస్తున్నాయి. ప్రవీణ్ గురించి ఎస్సై సుబ్బారావు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. మార్చి 24 సాయంత్రం 5 గంటలకు ప్రవీణ్ విజయవాడ చేరుకున్నారని, సాయంత్రం 5.20 గంటలకు రామవరప్పాడు VMC పార్క్ దగ్గర ఆయన పడిపోయాడన్నారు. అదే సమయంలో ఆయన్ని చూసి హాస్పిటల్‌కు వెళ్దామా అని ప్రవీణ్‌ను అడిగినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. రాత్రి 8 గం. వరకు VMC పార్క్ దగ్గరే ప్రవీణ్ నిద్రపోయాడని ఎస్సై సుబ్బారావు చెప్పారు.