కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌కు ప్రమాదం జరిగింది. పూజ చేస్తుండగా.. దీపం అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా గిరిజా గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. అలాగే రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు.