పద్మనాభం గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాలడ పద్మనాభం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.