బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు సమష్టి కృషి అవసరమని, కేవలం ఒక్క అధికారులు మాత్రమే చర్యలు చేపడితే సరిపోదని యునిసెఫ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ పరిణామం చాలా విచారకరమన్నారు. కిశోర వికాసం అనే అంశంపై శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రాంతీయ స్థాయి వర్క్ షాప్ జరిగింది.